CURRENT - KTR | కరెంటు చార్జీల పెంచ వద్దు
CURRENT - KTR | కరెంటు చార్జీల పెంచ వద్దు
కరెంటు ఛార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తాం
కరెంటు ఛార్జీలు పెంచితే పరిశ్రమలు మూతపడుతాయి
నిజమైనా బాంబులకే భయపడలేదు.. సుతిల్ బాంబులకు భయపడతామా ?
కరెంటు ఛార్జీలతో ప్రజల నడ్డి విరచడానికే సీఎం రేవంత్ కుట్ర
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం
HYDERABAD | రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు (KTR) అన్నారు. గత పదేండ్లు రాష్ట్రంలో స్వర్ణయుగంలా నడించిందని, కాని ఈ పది నెలల నుంచి దినమొక యుగంలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హయాంలో రైతులపై రూపాయి రుణ భారం పడలేదని తెలిపారు. అన్నదాతలకు ఉచితంగా విద్యుత్ అందించామని తెలిపారు. విద్యుత్ చార్జీల పెంపు, ఆదాయ ఆవశ్యకతపై సిరిసిల్లలో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా కేటీఆర్ తమ వాదన వినిపించారు. రాష్ట్ర ప్రజలపై కరెంటు భారం మోపడం ఎంత మాత్రం సరికాదన్నారు. సిరిసిల్ల నేతన్నలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీలను 5 రెట్లు పెంచే ప్రతిపాదనను బీఆర్ఎస్ తరుపున వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో అన్నిరకాల పరిశ్రమలకు సరఫరా చేసే కరెంటు ను ఒకే గాటున కట్టడం సరికాదన్నారు. కరెంటు చార్జీల పెంపుతో కుటీర పరిశ్రమలపై భారం పడుతుందని, రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు బాగా దెబ్బతింటున్నాయని తెలిపారు. అన్ని రకాల ఇండస్ట్రీలను కాపాడుకుంటేనే మనుగడ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉచిత విద్యుత్ భారాన్ని మధ్యతరగతి, చిన్న పరిశ్రమలు, భారీ పరిశ్రమల పై వెయ్యాలన్న ఆలోచన ఎట్టి పరిస్థతుల్లో సమంజసం కాదని చెప్పారు. బాధ్యతగల ఈఆర్‌సీ ఈ విషయంలో ప్రజలు, రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలన్నారు. కరెంటు చార్జీలు పెంచాలి అనే ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించాలని పిలుపునిచ్చారు.
ఉచిత విద్యుత్ పేరుతో ఉన్న విద్యుత్‌ను ఊడగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. పది నెలల్లో ఒక వైపు కరెంటు కోతలు, మరోవైపు చార్జీల మోతలు అని కేటీఆర్ విమర్శించారు. అయితే చార్జీల పెంపును అడ్డుకుంటామని, ఈ విషయంలో ప్రజా పోరాటానికైనా వెనుకాడమన్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల నడ్డి విరిచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. అదానీ, అంబానీలకు.. సిరిసిల్ల నేతన్నలకు ఒకే కేటగిరి కరెంటు ను ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గత పదేండ్లలో ఆత్మహత్యలు లేవు అని, కానీ 10 నెల్లలోనే 10 మంది చనిపోయారు అని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిని తన బుద్ధి మార్చుకోవాలని హితవు పలికారు. దీపావళికి ముందే బాంబులు పెళుతాయన్న మంత్రి పొంగులేటి కామెంట్స్‌పై కేటీఆర్ స్పందించారు. దీని ప్రభావం అయన పై జరిగిన ఈడి రైట్స్ కావచ్చని ఎద్దేవా చేశారు. ఎం చేస్తారో చేసుకోండని స్పష్టం చేశారు. ఈ చిట్టి నాయుడు ఏం చేస్తాడని, చిల్లర కేసు పెట్టి జైలుకి పంపిస్తారు కావచ్చు.. అంతే కదా అని అన్నారు. నిజమైన బాంబులకే భయపడలేదు, గీ సుతిల్ బాంబులకు భయపడతానా, అని అన్నారు. అలాగే జగిత్యాల ఎంఎల్ఏ సంజయ్‌పై కేటీఆర్ ఫైరయ్యారు. ఆయనో రాజకీయ వ్యభిచారి అని తీవ్రంగా విమర్శించారు. జగిత్యాలలో కాంగ్రెస్ నాయకులే ఒకరినొకరు చంపుకుంటున్నారని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోనే సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
* * *
Leave A Comment